: ‘సన్ రైజర్స్’ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం
సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్ కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్-9 లో భాగంగా ఈరోజు జరిగిన టీ20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్దేశించిన 143 పరుగుల విజయ లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికే కోల్ కతా జట్టు ఛేదించింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు స్కోరు: రాబిన్ ఊతప్ప(38), ఆండ్రూ రస్సెల్ రెండు పరుగులు చేశారు. గౌతం గంభీర్ (90), మనీష్ పాండే పదకొండు పరుగులతో నాటౌట్ గా నిలిచారు.