: రెండు వికెట్లు కోల్పోయిన కోల్ కతా నైట్ రైడర్స్
ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ టీ 20 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ రెండు వికెట్లు కోల్పోయింది. రాబిన్ ఊతప్ప (38), ఆండ్రె రస్సెల్ (2) వికెట్లను వరుసగా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అశ్విన్ రెడ్డి, ముస్తాఫిజూర్ లు తీసుకున్నారు. 16.1 ఓవర్లు ముగిసే సరికి 124 పరుగులు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ రెండు వికెట్లు కోల్పోయింది. గౌతం గంభీర్ (73), మనీష్ పాండే (8) ల భాగస్వామ్యం కొనసాగుతోంది. కాగా, టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కు సన్ రైజర్స్ 143 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.