: పదిన్నర లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ నంబర్ దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ తనకు నచ్చిన ఫ్యాన్సీ నంబరు కోసం రూ.10.50 లక్షలు వెచ్చించి వేలం పాటలో దానిని సొంతం చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశాడు. ఫ్యాన్సీ నంబర్ టీఎస్ ఈఎల్ 9999 కోసం నిర్వహించిన వేలం పాటలో ముగ్గురు పోటీపడగా, రూ.10.50 లక్షలకు ఆ నంబర్ ను జూనియర్ ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. కాగా, జూ.ఎన్టీఆర్ దగ్గర ఉన్న కార్ల నంబర్లన్నీ 9999గా ఉండటం విశేషం.