: జ‌పాన్‌ను కుదిపేస్తున్న భూప్ర‌కంప‌న‌లు.. రిక్టర్‌స్కేల్‌పై 7.3 తీవ్రతతో మ‌రోసారి భూకంపం

దక్షిణ జపాన్‌లోని కుమమోటోలో గురువారం రాత్రి సంభవించిన భూకంపం నుంచి తేరుకోక‌ముందే ఈరోజు తెల్లవారుజామున మ‌రోసారి భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌స్కేల్‌పై భూకంప‌ తీవ్రత 7.3గా నమోదైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు, 400 మందికి పైగా గాయప‌డిన‌ట్లు స‌మాచారం. ఆస్తి, ప్రాణ నష్టంపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. భూకంప కేంద్రం మొన్నటి భూకంప కేంద్రానికి ఆగ్నేయంలో 12 కి.మీ దూరంలో ఉన్నట్లు గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఇది ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

More Telugu News