: బాలీవుడ్ వెటరన్ దిలీప్ కుమార్ ఆరోగ్యం విషమం... లీలావతి ఆసుపత్రికి తరలింపు
బాలీవుడ్ పాత తరం నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత దిలీప్ కుమార్ ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో సతమతమవుతున్న దిలీప్ కుమార్ ఆరోగ్యం నిన్న రాత్రి ఉన్నట్లుండి విషమంగా మారింది. సకాలంలోనే ఆసుపత్రికి చేరిన దిలీప్ కుమార్ కు లీలావతి ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరికాసేపట్లో దిలీప్ కుమార్ తాజా ఆరోగ్య పరిస్థితికి చెందిన వివరాలు వెల్లడికానున్నాయి.