: నటన కాబట్టి దేనికీ అభ్యంతరం చెప్పను!: రాశీ ఖన్నా


లిప్ లాక్ ముద్దు సీన్లకు తాను రెడీ అని సినీ నటి రాశీ ఖన్నా తెలిపింది. 'సుప్రీం' ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ చానెల్ తో ఆమె మాట్లాడుతూ, తాను యాక్ట్రెస్ నని, పాత్రను బట్టి నటించాలి తప్ప...'దీనిలో నటించను' అని ప్రత్యేకంగా దేనికీ అభ్యంతరం చెప్పనని తెలిపింది. కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్స్ లో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం తనకు ఇష్టమని చెప్పింది. హైదరాబాదులో ఇల్లు కొనుక్కోవడం ఆనందంగా ఉందని తెలిపింది. సినీ నటులు అన్నాక ఒకే భాషలో నటిస్తానని గిరిగీసుకుని కూర్చోలేనని పేర్కొంది. అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం తెలుగు సినీ నటిగా ఆకట్టుకోవడం పట్ల సంతోషంగా ఉన్నానని రాశీ ఖన్నా చెప్పింది.

  • Loading...

More Telugu News