: కథ, కథనం, దర్శకుడు, హీరో నచ్చాలి: రాశీ ఖన్నా


తను ఓ సినిమాలో నటించాలంటే కథ, కథనం, దర్శకుడు, హీరో నచ్చాలని నటి రాశీ ఖన్నా తెలిపింది. ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనాతో స్నేహంగా ఉంటానని చెప్పింది. తమ మధ్య కాంపిటేషన్ అన్న సమస్య లేదని, సినిమా అవకాశాలు ఉంటాయి, ఉండకపోతాయి, స్నేహం మాత్రం చిరకాలం ఉంటుందని తెలిపింది. అందుకే తామంతా స్నేహంగా ఉంటామని చెప్పింది. అంతకంటే ముందు తమ అభిరుచులు ఒకటేనని, తామందరి కామన్ సబ్జెక్టు సినిమా అని, అందుకే తాము స్నేహంగా ఉంటున్నామని చెప్పింది. 'సుప్రీం' సినిమాలో పాత్ర తనకు సంతోషం ఇచ్చిందని రాశీ ఖన్నా పేర్కొంది. 'ఊహలు గుసగుసలాడే' సినిమా తరువాత తనకు బాగా నచ్చిన సినిమా 'సుప్రీం' అని తెలిపింది. ఈ సినిమాలో పోలీస్ పాత్ర కోసం సన్నబడ్డానని తెలిపింది. ఫిట్ గా ఉండడం అభిమానులతో పాటు తనకు కూడా సంతోషం కలిగించిందని ఆమె అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News