: విశాఖలో బీసీసీఐ అధికారులు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ స్టేడియంను బీసీసీఐ అధికారులు పరిశీలించారు. ఈ నెల 30 తరువాత మహారాష్ట్రలో నిర్వహించాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను విశాఖపట్టణంలో నిర్వహించే అవకాశాలను బీసీసీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. విశాఖలో మ్యాచ్ లు నిర్వహించేందుకు సానుకూల వాతావరణం కనిపిస్తున్నప్పటికీ...ఎండలు మ్యాచ్ లు నిర్వహించే అవకాశానికి గండికొట్టేలా కనిపిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల్లో ఆడితే...ఆటగాళ్లు డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ లు నిర్వహించే అవకాశంపై బీసీసీఐ అధికారులు పెదవి విప్పాల్సిన అవసరం ఉంది. కాగా, మహారాష్ట్రలో మ్యాచ్ లు నిర్వహించే అవకాశం లేకపోవడంతో మోహాలీతో పాటు మరో వేదిక కోసం బీసీసీఐ అన్వేషిస్తోంది.

More Telugu News