: రాహుల్ రాజ్ సింగ్ బెదిరిస్తున్నాడు: ప్రత్యూష బెనర్జీ తల్లిదండ్రులు

హిందీ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య నిందితుడు, ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ తమను బెదిరిస్తున్నాడని ఆమె తల్లి సోమా బెనర్జీ ఆరోపించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బంగూర్ నగర్ పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదని, రాహుల్ రాజ్ సింగ్ ను సాక్షులను ప్రభావితం చేసేలా స్వేచ్ఛగా వదిలేశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు. తమకు న్యాయం జరగాలంటే ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులతో దర్యాప్తు చేయించాలని ఆమె ఈ లేఖలో డిమాండ్ చేశారు. రాహుల్ తమ కుమార్తెను మోసం చేయడమే కాకుండా ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడని, తమ కుమార్తెలాగే మరికొందరు యువతులను మోసం చేశాడని ఆమె మండిపడ్డారు. రాహుల్ తమతో పాటు ఇతర సాక్షులను కూడా బెదిరిస్తున్నాడని ఆమె లేఖలో తెలిపారు.

More Telugu News