: ఈ ఐదు సూచనలు పాటిస్తే మోదీని దేశ ప్రజలు శభాష్ అంటారు: కేజ్రీవాల్
ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలు సెల్యూట్ చేయాలంటే ఓ ఐదు సూచనలు తప్పకుండా పాటించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ట్విట్టర్ లో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడేవారిని అన్ ఫాలో చేయాలని అన్నారు.
* హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులను బర్తరఫ్ చేయాలని ఆయన సూచించారు.
* ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి తప్ప, దొడ్డి దారిన ప్రభుత్వాలను కూలదోసి అధికారం చేపట్టకూడదని ఆయన చెప్పారు.
* ఢిల్లీ ప్రజలు ప్రభుత్వ పాలనపై సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని అంగీకరించాలని ఆయన సూచించారు.
* భారత్ మాతాకీ జై అనని వారిపై భౌతిక దాడులు చేయడం మానాలన్నారు.
* ప్రజల ఆహారపుటలవాట్లలో జోక్యం చేసుకోవడం మానాలని ఆయన తెలిపారు.
ఈ ఐదు సూత్రాలు పాటిస్తే ప్రజలు మోదీకి సెల్యూట్ చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.