: రెండేళ్ల నాటి విమాన ప్రమాదానికి కారణం ఇద్దరు అధికార్లు, ఇద్దరు పైలెట్లే!
2014లో తైవాన్ లో కుప్పకూలిన ట్రాన్స్ ఏసియా విమానం 49 మంది ప్రాణాలను బలిగొనగా, ఈ దుర్ఘటనకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు కారణమని విచారణలో తేలింది. ఈ ప్రమాదానికి విమానాన్ని నడుపుతున్న ఇద్దరు పైలట్ల తప్పు కూడా ఉందని పెన్గూ ప్రాసిక్యూటర్ల బృందం వెల్లడించింది. పెన్గూ ద్వీపంలోని మేగాంగ్ నగరంలోని రెసిడెన్షియల్ ఏరియాపై ట్రాన్స్ ఏసియాకు చెందిన జీఈ222 విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే.
"నలుగురు అధికారులు విధుల్లో చూపిన నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో పైలట్లు కూడా చనిపోయారు కాబట్టి వారిని విచారించలేము. గ్రౌండ్ స్టాఫ్, తాము చూపిన నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. వీరికి ఐదేళ్ల వరకూ జైలుశిక్ష పడుతుంది" అని ఓ అధికారి తెలిపారు.