: హర్షా భోగ్లే, క్రికెటర్ మధ్య వాగ్వాదం... విమానంలో వాదులాటతోనే బీసీసీఐ కీలక నిర్ణయం


విశ్వవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే కనిపించడం లేదు. క్రికెట్ లవర్స్ ను తన మాట తీరుతో ఇట్టే ఆకట్టుకునే సమ్మోహన శక్తి కలిగిన హర్షా భోగ్లే... ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ సీజన్లన్నింటిలో తన వ్యాఖ్యానంతో దుమ్ము రేపారు. అయితే ఐపీఎల్ తాజా సీరిస్ కు గంటల ముందు బీసీసీఐ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కామెంటేటర్ల జాబితా నుంచి హర్షా భోగ్లే పేరును తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను మాత్రం బీసీసీఐ పెద్దలు ఇప్పటిదాకా చెప్పనే లేదు. ఈ క్రమంలో హర్షా భోగ్లే కనిపించకపోవడంపై పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ కోవలో ఇప్పటికే పలు కారణాలు తెర మీదకు రాగా, తాజాగా మరో ఆసక్తికర ఊహాగానం వెలుగుచూసింది. ఆ ఉహాగానం ప్రకారం... ఐపీఎల్ కు ముందు టీమిండియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న విమానంలోనే హర్షా భోగ్లే కూడా ప్రయాణించారు. ఈ సందర్భంగా జట్టు సీనియర్ క్రికెటర్ ఒకరు హర్షా భోగ్లేతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా విమానం ఆకాశంలో ఉండగానే భోగ్లే, సదరు క్రికెటర్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకానొక సందర్భంలో జట్టును దూషిస్తూ భోగ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మరో క్రికెటర్ వారిద్దరిని వారించి అప్పటికి వాగ్వాదానికి తెర దించారు. అయితే విమానం దిగిన తర్వాత మాత్రం జట్టు సభ్యులు నేరుగా బీసీసీఐ పెద్దలకు భోగ్లేపై ఫిర్యాదు చేశారు. జట్టును, జట్టు సభ్యులను కించపరుస్తూ భోగ్లే అసభ్యకర వ్యాఖ్యలు చేశారని వారు చేసిన ఫిర్యాదుతోనే బీసీసీఐ భోగ్లేపై వేటు వేసింది.

  • Loading...

More Telugu News