: ఈ-సిగరెట్లు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయట... టీనేజర్లు వీటి బారిన పడుతున్నారు!


పొగతాడం దుర్వ్యసనం అన్న విషయాన్ని అంతా అంగీకరిస్తారు. దీనిని మాన్పించేందుకు ఈ-సిగరెట్లను కూడా వాడుకలోకి తెచ్చారు. వీటిని తాగడం ద్వారా కేన్సర్ వచ్చే అవకాశం లేదని, అదే సమయంలో పొగత్రాగడం వ్యసనం నుంచి విముక్తి కూడా లభిస్తుందని నిపుణులు ఈ-సిగరెట్ గురించి ప్రచారం చేశారు. అయితే వీటి కారణంగా దుర్వ్యసనం నుంచి విముక్తి లభించడం సంగతి పక్కనపెడితే, టీనేజర్లు వీటి వైపు ఆకర్షితులవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ-సిగరెట్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కోవడంతో టీనేజర్లు వాటి వైపు ఆకర్షితులవుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ స్టెర్లింగ్ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో తేలింది. 11 నుంచి 18 ఏళ్ల లోపు వారు వీటి పట్ల ఆకర్షితులవుతున్నారని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని పరిశోధనలో పాల్గొన్న కేథరీన్ బెస్ట్ అభిప్రాయపడ్డారు. నాలుగు వేల మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్టు ఆమె చెప్పారు. అయితే ఈ-సిగరెట్లు అనేవి వయసు మళ్లిన పొగరాయుళ్లకు మాత్రమే అనే విషయం ప్రచారం సందర్భంగా తెలపాలని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News