: ఐఎస్ఐఎస్‌ను అంతమొందిస్తాం: ఆయుధాలు పట్టిన కుర్దిష్ మహిళలు
వికృత చేష్టలతో దారుణ మారణకాండకు పాల్పడుతోన్న ఐఎస్ఐఎస్ పట్ల టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్‌లోని కుర్దిష్ మహిళలు పోరాటానికి సిద్ధమయ్యారు. తమపై దారుణాలకు ఒడిగడుతోన్న ఐఎస్ఐఎస్‌ను అంతమొందిస్తామని చెబుతున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేసేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అంటున్నారు. తమ గ్రామాలపై దాడులు చేసి అమాయకుల్ని విచక్షణారహితంగా బాధిస్తోన్న ఉగ్రవాదులను వదలబోమని హెచ్చరిస్తున్నారు. కుర్దులు అధికంగా నివసిస్తోన్న ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రవేశించి వారిని సర్వనాశనం చేసి, యువతులను బందీలుగా తీసుకువెళ్తున్న నేపథ్యంలో.. కుర్దిష్ మహిళలు ఓ సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు.