: మోదీ కొత్త నినాదం 'గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్'!

గ్రామాల్లో అభివృద్ధి జరిగితేనే భారత్ ముందుకు దూసుకెళుతుందని నమ్మే ప్రధాని నరేంద్ర మోదీ, 'గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్' అన్న నినాదంతో సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ 125వ జయంతి వేడుకల వేళ, మధ్యప్రదేశ్ లోని ఆయన స్వస్థలం 'మావు' గ్రామంలో పర్యటించిన ఆయన, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌ విశ్వమానవుడని కొనియాడారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మోదీ ప్రసంగిస్తూ, గ్రామాభ్యుదయానికి అంబేద్కర్ కలలు కన్నారని, ఆయన కలలను నిజం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి భుజస్కంధాలపై ఉందని అన్నారు. ఈ సరికొత్త ప్రచారాన్ని అంబేద్కర్ స్వగ్రామం నుంచి తాను ప్రారంభించడం ఎంతో అదృష్టమని చెప్పారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఆయన పోరాడారని, ప్రజల మధ్య సమానత్వం, దళితులకు సంఘంలో గౌరవం కోసం కలలు కన్నారని గుర్తు చేసుకున్నారు.

More Telugu News