: నా బట్టలు చించారు, ఇష్టమొచ్చినట్టు తిట్టారు: ఆరోపించిన తృప్తీ దేశాయ్

హిందూ సంస్థలు తనను హత్య చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆలయాల్లో మహిళల సమానత్వం కోసం పోరాడుతున్న భూమాతా బ్రిగేడ్ నేత తృప్తీ దేశాయ్ ఆరోపించారు. కొల్హాపూర్ లో కొందరు తన బట్టలు చించివేశారని, తనను నోటితో చెప్పలేని విధంగా తూలనాడారని ఆమె ఆరోపించారు. కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారి గర్భగుడిలోకి తన ఇష్టం వచ్చిన దుస్తులను ధరించే వెళతానని తృప్తీ దేశాయ్ పట్టుబట్టిన సమయాన, ఉద్రిక్తత నడుమ ఈ దాడి జరుగగా, పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె, ఆందోళనకారులు తనను ప్రాణాలతో బయటకు పోనీయరాదని మాట్లాడుకున్నారని, స్వయంగా ఆలయ పూజారి తనను అడ్డుకున్నారని అన్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కల్పించుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News