: ఇంటి భోజనం ఇక రైళ్ల‌లోనూ దొరుకుతుంది!

ఇంట్లో వండే ఆహార పదార్థాలను అమితంగా ఇష్ట‌ప‌డే భోజన ప్రియులకు రైల్వే శాఖ ఓ శుభ‌వార్త అంద‌జేసింది. రైలు ప్ర‌యాణం స‌మ‌యాల్లో ఇంటి భోజ‌నం మిస్స‌వుతూ, ఒంటికి అంత‌గా ప‌డ‌ని ఆహారంతోనే స‌రిపెట్టుకునే అవ‌స‌రం ఇక లేద‌ని చెబుతోంది. నాబార్డ్‌, ఐఆర్‌సీటీసీ సంయుక్తంగా ప్రారంభించిన ఓకొత్ స‌ర్వీస్‌తో ఇంటి వంట లాంటి భోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు. స్వయం సహాయక సంఘాల సాయంతో వండిన ఈ భోజన స‌ర్వీసుని మ‌హారాష్ట్ర, కేర‌ళ‌లోని ప‌లు రైల్వే స్టేషన్లలో ఇప్ప‌టికే ఆరంభించేశారు. త్వ‌ర‌లో దేశ‌వ్యాప్తంగా ప్రారంభించ‌నున్నారు. ఈ వంటకాలు కావాల‌నుకునే రైలు ప్ర‌యాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

More Telugu News