: మావయ్య లాంటి నటుడు దొరకరు: 'ఊపిరి' సక్సెస్ మీట్ లో సుశాంత్


తన మావయ్య లాంటి వర్సటైల్ యాక్టర్ మరొకరులేరని యువనటుడు సుశాంత్ తెలిపాడు. ఊపిరి సక్సెస్ మీట్ లో సుశాంత్ మాట్లాడుతూ, వైవిధ్యమైన పాత్రలు వేయడంలో తన మావయ్య నాగార్జున ప్రత్యేకతే వేరని అన్నాడు. 'గీతాంజలి', 'శివ', 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'సోగ్గాడే చిన్నినాయనా', 'ఊపిరి'... ఇలా ఏ సినిమా తీసుకున్నా, ఏ పాత్రకాపాత్ర ప్రత్యేకంగా ఉండేలా ఆయన చూసుకున్నారని సుశాంత్ చెప్పాడు. తెలుగు తెరకు ఇలాంటి నటుడు దొరకడం అదృష్టమని పేర్కొన్నాడు. అలాంటి నటుడు తన లాంటి యువ నటులకు ఎల్లప్పుడూ స్పూర్తిగా ఉంటాడని సుశాంత్ చెప్పాడు. తాతగారి పేరును నిలబెడుతూ, తనదైన శైలిలో ఆయన రాణించారని సుశాంత్ తెలిపాడు. 'ఊపిరి' లాంటి సినిమాలో నటించాలంటే ఓ ఇమేజ్ ఉన్న నటుడు ఎవరైనా ఆలోచిస్తారని, ఆయన మాత్రం అలాంటి ఆలోచన పెట్టుకోకుండా దానిని అంగీకరించడం ఆయనలోని ప్రత్యేకతను తెలియజేస్తుందని సుశాంత్ చెప్పాడు.

  • Loading...

More Telugu News