: ఐఎస్ఐఎస్ అత్యంత క్రూరమైన ఆదేశం
ఐఎస్ఐఎస్ అత్యంత క్రూరమైన ఆదేశం జారీ చేసింది. సిరియా, ఇరాక్ లలో సంకీర్ణదళాల సాయంతో కుర్దులు క్రమంగా ఐఎస్ఐఎస్ పై పైచేయి సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి అధీనంలో ఉన్న పలు పట్టణాలను సంకీర్ణ దళాల సాయంతో కుర్దులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఐఎస్ఐఎస్ అత్యంత క్రూరమైన ఆదేశాలు జారీ చేసింది. తమ వద్ద బందీలుగా ఉన్న కుర్దులను సూసైడ్ బాంబర్లుగా మార్చాలని ఆదేశించింది. దీనికి అంగీకరించని వారిని ఊచకోత కోయాలని తమ కమాండర్లకు సూచించింది.
కొంత మంది కుర్దు కోవర్టుల కారణంగా ఐఎస్ఐఎస్ వారి గ్రామాలపై దురాక్రమణకు దిగి, ఎదిరించిన పురుషులను గ్రామశివార్లలో హతమార్చి, యువతులను, మహిళలను బానిసలుగా చేసుకుని, వయసు మళ్లిన వారిని ఆయా గ్రామాల్లో వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారికి అనుకూలంగా పని చేసిన కుర్దులను ఇప్పుడు తమపై యుద్ధానికి దిగుతున్న కుర్దుయోధులపైకి సూసైడ్ బాంబర్లుగా ప్రయోగిస్తోంది.