: నా విజయానికి పూర్తి బాధ్యత నాదే...ఇందులో ఎవరికీ క్రెడిట్ లేదు: ప్రియాంకా చోప్రా


సాధారణంగా మహిళలు విజయం సాధిస్తే ఆ క్రెడిట్ వేరే వాళ్లు తీసుకుంటుంటారని ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా తెలిపింది. పద్మశ్రీ అవార్డు అందుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన విజయానికి పూర్తి బాధ్యత తానేనని చెప్పింది. ఈ విజయంలో ఎవరికీ భాగం లేదని స్పష్టం చేసింది. ప్రణాళికా బద్దంగా మంచి టీమ్ తో పని చేయడం వల్ల తనను విజయం వరించిందని ప్రియాంక చెప్పింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, మనసు పెట్టి అంకితభావంతో పని చేయడం వల్ల తనను విజయం వరించిందని ఆమె పేర్కొంది. కెమెరా ముందు యాక్షన్ చెప్పినప్పటి నుంచి కట్ చెప్పే వరకు తాను తప్ప వేరే వ్యక్తి చేయరు కదా? అని ఆమె ప్రశ్నించింది. చిన్న వయసు నుంచే ప్రణాళికాబద్దంగా పని చేయడం వల్ల విజయం తనను వరించిందని ఆమె చెప్పింది.

  • Loading...

More Telugu News