: జయలలితను సవాల్ చేయనున్న కుష్బూ!
తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలితపై సినీనటి కుష్బూను పోటీకి పెట్టాలని కాంగ్రెస్-డీఎంకే కూటమి భావిస్తోంది. జయలలిత చెన్నై పరిధిలోని ఆర్కే నగర్ నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇదే నియోజకవర్గం నుంచి కుష్బూను ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థినిగా బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. జయలలిత పోటీలో ఉండటంతో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఆర్కే నగర్ నుంచి ఆమెకు పోటీగా ఓ హిజ్రా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక కుష్బూ కూడా పోటీలో దిగి జయలలితకు సవాల్ విసిరితే, ఈ నియోజకవర్గం పోరు మరింత ఆసక్తికరంగా మారుతుందనడంలో సందేహం లేదు.