: కేసీఆర్ సర్కారు నుంచి రూ. 2,500 కోట్లు వసూలు చేయండి: అధికారులతో చంద్రబాబు

హైదరాబాద్ లోని విద్యుత్ సంస్థల విభజన తరువాత, తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 2,500 కోట్లను వసూలు చేయడంతో పాటు, రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను పరిరక్షించాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. బకాయిల వసూళ్లకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని కలిసి విన్నవించగా, ఆయన స్పందించారు. ఆస్తుల విభజన కూడా ఉద్యోగుల విభజన జరిగిన నిష్పత్తిలోనే సక్రమంగా జరిగేలా చూడాలని, అందుకు ఓ సంయుక్త కమిటీని నియమించాల్సి వుందని కూడా సంఘం నేతలు సూచించారు. వారితో చర్చించిన చంద్రబాబు, ఉద్యోగులు, ఆస్తుల విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

More Telugu News