: ఈ అవార్డును నా కూతురికి అంకితమిస్తున్నా: ఐశ్వర్యారాయ్ బచ్చన్
గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తన కూతురు ఆరాధ్యకు అంకితమిస్తున్నానని బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ అన్నారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ భారత మహిళ అవార్డును ఆమె అందుకున్నారు. ముంబయిలో జరిగిన ప్రవాసీ భారతీయుల అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఐశ్వర్యా రాయ్ పాల్గొన్నారు. అనంతరం, ఆమె మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై భారతీయ మహిళ ఉన్నతిని పెంచేందుకు ఈ అవార్డు దోహదపడుతుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ అవార్డుల ప్రదానోత్సవంలో మొత్తం 17 మంది వ్యక్తిగతంగా అవార్డులు స్వీకరించారు. అందులో వృత్తి, కళ, సంప్రదాయం, స్పెషల్ జ్యూరీ, గ్లోబల్, ఐకాన్, వ్యాపారం మొదలైన అంశాల వారీగా అవార్డులు అందజేశారు. ఈ ప్రత్యేక అవార్డులు అందుకున్న వారిలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఉంది.