: ఐశ్వర్యారాయ్ చేతిని ముద్దుపెట్టుకున్న బ్రిటిష్ ఫొటో జర్నలిస్టు!


కొన్ని ఊహించని సంఘటనలు అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటాయి. సాధారణ వ్యక్తుల విషయంలో అయితే, ఆ సంఘటన వాళ్లకు మాత్రమే ఆశ్చర్యమో, ఆనందమో, లేక ఇతర భావోద్వేగాలో కల్గుతాయి. కానీ, ఇటువంటి ఊహించని సంఘటన మాజీ మిస్ వరల్డ్, ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కు ఎదురైంది. బ్రిటిష్ యువరాజు విలియమ్, యువరాణి కేట్ మిడిల్టన్ ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక దాతృత్వ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యారాయ్ కు కూడా ఆహ్వానం అందటంతో ఆమె అక్కడికి వెళ్లింది. పలువురు ఫొటో జర్నలిస్టులు ఆమెను ఫొటోలు తీశారు. ఆ ఫొటో జర్నలిస్టుల్లో బ్రిటిష్ జర్నలిస్టు కూడా ఉన్నారు. ఆ జర్నలిస్టు ఐశ్వర్యకు పరిచయమున్నట్లు తెలుస్తోంది. పలకరింపులో భాగంగా షేక్ హ్యాండ్ ఇచ్చిన ఐశ్వర్య చేతిని సదరు జర్నలిస్టు ముద్దుపెట్టుకుని తన విషెష్ తెలిపాడు.

  • Loading...

More Telugu News