: రాణించిన ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్...పంజాబ్ స్కోరు 161


ఐపీఎల్ సీజన్-9లో తొలిసారి భారీ స్కోరు నమోదైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, గుజరాత్ లయన్స్ మధ్య మొహాలీలో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఆకట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ ఓపెనర్లు మురళీ విజయ్ (42), వోహ్రా (38) రాణించారు. వీరిద్దరు శుభారంభం ఇచ్చినప్పటికీ టాప్ ఆర్డర్ విఫలమైంది. దీంతో కాస్త ఇబ్బంది పడ్డప్పటికీ పంజాబ్ బ్యాట్స్ మన్ కుదురు కున్నారు. మిల్లర్ (15), మ్యాక్స్ వెల్ (2) విఫలం కాగా, సాహా (20), స్టెయినీస్ (30) ఆకట్టుకున్నారు. దీంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు సాధించింది. గుజరాత్ బౌలర్లలో బ్రావో 4 వికెట్లతో రాణించగా, జడేజా రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. 162 పరుగుల విజయ లక్ష్యంతో రైనా సారధ్యంలో గుజరాత్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News