: చాలా లోతుగా ఆలోచించి '24' అనే టైటిల్ ఖరారు చేశారు: కార్తీ
'ఊపిరి' సినిమాలో తనను ఆదరించినందుకు ధన్యవాదాలని హీరో కార్తీ చెప్పాడు. '24' ఆడియో వేడుకలో కార్తీ మాట్లాడుతూ, 'ఊపిరి' సినిమాలో తాను వేసిన పెయింటింగ్ లాగే ఈ సినిమా కూడా మాస్టర్ పీస్ అని అన్నాడు. దీంతో ఆడిటోరియం కరతాళ ధ్వనులతో నిండిపోయింది. ఈ సినిమా టైటిల్ చెప్పినప్పుడు '24' ఏంటి? అని చాలా ఆలోచించానని అన్నాడు. అసలు విషయం ఆ తరువాత అర్థమైందని అన్నాడు. టైమ్ అనే దాంట్లో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని, అందుకే దీనికి '24' అని పెట్టారని ఆయన చెప్పాడు. ఈ సినిమాలో తన అన్నయ్య మూడు పాత్రల్లో నటించాడని, దేనికదే విభిన్నమని కార్తీ చెప్పాడు. సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని కార్తీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తాను రెహమాన్ ను స్పూర్తిగా తీసుకుంటానని చెబుతున్నానని అన్నాడు. జీవితాన్ని సానుకూలంగా తీసుకుని కష్టపడబట్టే రెహమాన్ ఉన్నత స్థానానికి చేరుకున్నారని కార్తీ అన్నాడు. అలాగే తాను కూడా జీవితాన్ని సానుకూలంగా తీసుకుంటున్నానని కార్తీ తెలిపాడు.