: ‘సచిన్’ సినిమా పోస్టర్ ను ఆవిష్కరించిన మాస్టర్ బ్లాస్టర్
లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’. ఈ చిత్రం పోస్టర్ ను సచిన్ ఈరోజు ఆవిష్కరించాడు. క్రికెట్ మైదానంలో నుంచి నడిచి వస్తున్న సచిన్ బ్యాట్, ప్యాడ్స్ ధరించి ఉంటాడు. ఆ పోస్టర్ పై ‘55 డేస్ ఆఫ్ ట్రెయినింగ్. వన్ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్. ది సచిన్ స్టోరీ’ అనే క్యాప్షన్ ఉంది. ఈ చిత్రం టీజర్ ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా సచిన్ ఒక ట్వీట్ చేశాడు. తనపై ప్రేమ కురిపించి, మద్దతుగా నిలిచిన వారందరికీ తన కృతఙ్ఞతలు అని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ నెల 14 వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ చిత్రం టీజర్ ను చూడాలని కోరారు. కాగా, ముంబయికి చెందిన '200 నాటౌట్' అనే ప్రొడక్షన్ సంస్థ ‘సచిన్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి బ్రిటిష్ డైరైక్టర్ జేమ్స్ ఎర స్కైన్ దర్శకత్వం వహిస్తున్నారు.