: అభిమానుల కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడతాడు: ఆది పినిశెట్టి


'సరైనోడు' ఆడియో వేడుకను చూస్తుంటే తాను రెండో తరగతి చదువుతున్నప్పుడు 'యముడికి మొగుడు' ఆడియో వేడుకలో పాల్గొన్న సంగతి గుర్తుకొస్తోందని ఆది పినిశెట్టి తెలిపాడు. 'సరైనోడు' ఆడియో వేడుక అంత పెద్ద ఈవెంట్ లో తాను తొలిసారి పాల్గొంటున్నానని ఆది తెలిపాడు. 'ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడం' అనే అంశంలో ఓ డాక్టరేట్ ప్రవేశపెడితే... అది బోయపాటి శ్రీనుకి ఇవ్వొచ్చని అన్నాడు. ఈ షాట్ కు అభిమానులు విజిల్స్ వేస్తారు, ఈ షాట్ కు కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఇలా ప్రతి షాట్ ను బోయపాటి చాలా క్లారిటీతో లెక్కలతో తీస్తాడని ఆది చెప్పాడు. అభిమానుల కోసం ఎంత కష్టపడాలో అల్లు అర్జున్ ను చూసి నేర్చుకున్నానని ఆది తెలిపాడు. అభిమానుల కోసం తను చాలా కష్టపడతాడని ఆది చెప్పాడు. తనకు, తమన్ కు 'వైశాలి' మొదటి సినిమా అని ఈ రోజు తమన్ పెద్ద సంగీత దర్శకుడయ్యాడని ఆది తెలిపాడు. చిరంజీవి అంకుల్ గురించి మాట్లాడేంత గొప్పవాడ్ని కాలేదని ఆది అన్నాడు.

  • Loading...

More Telugu News