: కంగనాతో కలిసి చిందేసిన ధోనీ, కోహ్లీ
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తో కలిసి క్రికెట్ స్టార్లు ధోనీ, కోహ్లీ గంతులేశారు. వీరిద్దరేకాదు, రహానే, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బిన్ని, వరుణ్ ఆరోన్ లు సైతం ఆడి పాడారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రమోషన్ కోసం దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఓ ప్రచార చిత్రం తయారు చేయగా, అందులో వీరంతా నటించారు. ‘క్వీన్’ చిత్రంలోని ‘లండన్ ఠుమక్దా’ పాట నేపథ్యంగా ఈ ప్రచార చిత్రాన్ని చిత్రీకరించారు. 'క్వీన్' సినిమాలో మాదిరిగానే, ఈ ప్రకటనలోనూ ఓ అమాయకపు అమ్మాయిగా కంగనా రనౌత్ కనిపించనుందని సమాచారం. ఇక షూటింగులో భాగంగా కంగానాతో కలిసి క్రికెటర్లు తెగ సందడి చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సందడిని చూడాలంటే ఈ ప్రకటన టీవీల్లో వచ్చే వరకూ ఆగాల్సిందే.