: నాకు ఎంత ఇవ్వాలో నేనే డిసైడ్ చేస్తా!: కాజల్ అగర్వాల్
సినీ రంగంలోకి వచ్చిన మొదట్లో దర్శకుడు ఎలా చెబితే అలా చేసేదాన్నని నటి కాజల్ అగర్వాల్ చెప్పింది. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, అప్పట్లోలా ఇప్పుడు చేయడం లేదని చెప్పింది. దర్శకుడు కొంత పాయింట్ వరకే సన్నివేశాన్ని చెబుతాడని, తాను దానిని మరో లెవెల్ కు తీసుకెళ్తానని తెలిపింది. సినీ పరిశ్రమలో తనకు మంచి స్నేహితులు ఎవరూ లేరని, స్నేహితులు మాత్రమే ఉన్నారని చెప్పింది. తాను డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే సినిమాలు అంగీకరించనని పేర్కొంది. తనకు ఎంతివ్వాలనేది తానే డిసైడ్ చేస్తానని చెప్పింది. ఎవరితో నటిస్తున్నాను, సినిమా ఎలా ఉంటుందనేది అంతా చూసుకుంటానని కాజల్ తెలిపింది. తనకు తెలుగు, తమిళ, హిందీ ఏదయినా ఒకటేనని, పరిశ్రమ ఏదైనా అంతా ఒకటే అని భాష మాత్రమే మారుతుందని కాజల్ చెప్పింది. తానేం చేయాలనుకుంటున్నానో, ఏం చేస్తున్నాననో తనకు పూర్తిగా తెలుసని చెప్పిన కాజల్, ఎవరేమన్నా, ఏమనుకున్నా పట్టించుకోనని తెలిపింది.