: అటు రాజ‌కీయ ఆరంగ్రేటం.. ఇటు సినిమాల్లోనూ కొన‌సాగింపు.. మలయాళ చిత్రంలో హీరోగా శ్రీ‌శాంత్


కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాజ‌పా నుంచి పోటీ చేయ‌డానికి ఇటీవ‌లే టికెట్ పొందిన టీమిండియా మాజీ ఆట‌గాడు శ్రీశాంత్ సినీ రంగంలోనూ త‌న కెరీర్‌ను కొన‌సాగిస్తున్నాడు. మలయాళ చిత్రం ‘టీం 5’లో హీరోగా న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభం అవుతోందని, ప్రేక్ష‌కుల బ్లెస్సింగ్స్, స‌హ‌కారం కావాలంటూ ఆ సినిమా హీరోయిన్ నిక్కి గల్రానీ ట్విట్ట‌ర్ ద్వారా కోరింది. ఈ సంద‌ర్భంగా ఆమె చిత్ర యూనిట్ పిక్ ను ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఇటీవలే బీజేపీలో చేరిన శ్రీ‌శాంత్ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఉదుమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయ‌డానికి బీజేపీ శ్రీ‌శాంత్‌కు టికెట్ ఇచ్చేసింది.

  • Loading...

More Telugu News