: ‘పనామా పేపర్స్’లో నాలుగో తెలుగోడు!... వర్జిన్ ఐల్యాండ్స్ లో కోనేరు మధు కంపెనీలు
ప్రపంచవ్యాప్తంగా పెను కలకలం రేపుతున్న పనామా పేపర్స్ లో మరో తెలుగోడి పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే హైదరాబాదులో ఎమ్మార్ ప్రాపర్టీస్ లో పలు ఆరోపణలు ఎదుర్కొన్న కోనేరు ప్రసాద్ కుమారుడు కోనేరు మధు బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ లో ఏకంగా 12 కంపెనీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దుబాయి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్రైమెక్స్ గ్రూపును కోనేరు మధు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కలకలం రేపిన బీచ్ శాండ్ కుంభకోణంలోనూ ట్రైమెక్స్ కంపెనీ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పనామా పేపర్స్ లో ఇప్పటికే ముగ్గురు తెలుగు వ్యాపారవేత్తల పేర్లు బయటకు రాగా, తాజాగా నాలుగో తెలుగోడిగా కోనేరు మధు పేరు వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ఇంకా తెలుగు నేలకు చెందిన ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.