: ఉగాది సందర్భంగా తెలుగు ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ప్రత్యేక మెనూ!

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఎయిర్ ఇండియా తెలుగు ప్రయాణికులకు ప్రత్యేక మెనూను ఆఫర్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు నుంచి నేడు తమ విమానాల్లో ప్రయాణించే వారికి ‘ఉగాది ప్రత్యేక మెనూ’ను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మెనూలో ఉగాది పచ్చడితో పాటు మామిడి కాయ పప్పు, గుత్తి వంకాయ మసాలా కూర, పెసర పప్పు, మసాలా వడ, మిర్చి బజ్జీ, పుణుగులు, బొబ్బట్లు, సేమియా పాయసం, నెయ్యి, అరటి పండులతో పాటు, నెయ్యి కారప్పొడితో మినీ ఇడ్లీ, సాంబారు, కొబ్బరి చెట్నీ, ఆలూ గోబీ ఫ్రై, పెరుగన్నం ఉన్నాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం హైటీలో ఈ తరహా మెనూను ఆఫర్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

More Telugu News