: మరో మ్యాజిక్ కు 'భజరంగీ భాయ్ జాన్' సిద్ధం


బాలీవుడ్ సినిమా కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన 'భజరంగీ భాయ్ జాన్' సినిమా మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్, ఆ సినిమా దర్శకుడు కబీర్ ఖాన్ సిద్ధమవుతున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో నటించేందుకు సల్మాన్ అంగీకరించాడంటూ ఇండియన్ సినిమా కలెక్షన్స్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆయన తెలిపిన కాసేపటికే దర్శకుడు కబీర్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో దీనిపై స్పందించారు. "అవును మేమిద్దరం '2017 ఈద్'కు కలిసి వస్తున్నాం" అంటూ ట్వీట్ చేశాడు. కాగా, సల్మాన్, కబీర్ ఖాన్ కాంబినేషన్లో 2012లో వచ్చిన 'ఏక్తా టైగర్' చిత్రం మంచి హిట్టయింది. త్వరలో రాబోయే కొత్త సినిమాతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోందని బాలీవుడ్ భావిస్తోంది. ఈసారి ఎలాంటి కథతో వీరిద్దరూ అభిమానులను అలరిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News