: హైదరాబాదు సమీపంలో తోషిబా ప్లాంట్!


జపాన్ కేంద్రంగా వివిధ రకాల ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్న తోషిబా సంస్థ హైదరాబాద్ సమీపంలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. ఇక్కడి నుంచి రైళ్లను నియంత్రించే పవర్ కన్వర్షన్ వ్యవస్థలను తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలన్నది తమ లక్ష్యమని టీటీడీఐ (తోషిబా ట్రాన్స్ మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) సీఎండీ కత్సుతోషి తోడా వెల్లడించారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సెంటర్ లో ప్రొడక్షన్ మొదలవుతుందని, 2020 నాటికి 100 మంది ఉద్యోగులకు ఉపాధిని కల్పించే స్థాయికి దీన్ని విస్తరిస్తామని ఆయన వెల్లడించారు. స్థానిక మార్కెట్ అవసరాలను బట్టి ఇక్కడ మరిన్ని ఉత్పత్తులను తయారు చేస్తామని తెలిపారు. మేకిన్ ఇండియాతో పాటు, భారత పారిశ్రామికాభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News