: ఆ రోజు కారు నేను నడపలేదు: సుప్రీంకు అఫిడవిట్ సమర్పించిన సల్మాన్ ఖాన్


హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించాడు. హిట్ అండ్ రన్ కేసుపై అందులో వివరణ ఇచ్చాడు. ఆ రోజు రాత్రి తాను కారు నడపలేదని సుప్రీంకోర్టుకు తెలిపాడు. డ్రైవరే కారును నడిపాడని, అయితే అప్పుడు పోలీసులు డ్రైవర్ వాంగ్మూలం నమోదు చేయలేదని అఫిడవిట్ లో సుప్రీంకోర్టుకు తెలిపాడు. కాగా, 2002లో సల్మాన్ ఖాన్ తాగిన మైకంలో ఫుట్ పాత్ పైకి కారును పోనిచ్చి ఒక వ్యక్తి మరణానికి, మరో నలుగురు గాయపడడానికి కారణమయ్యాడు. ఈ కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించగా, హైకోర్టు దానిని కొట్టివేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News