: వి ఆర్ బ్యాక్ ఎగెయిన్: హన్సిక ట్వీట్
‘వి ఆర్ బ్యాక్ అగెయిన్’ అంటూ దక్షిణాదికి చెందిన అందాల సినీ తార హన్సిక ఒక ట్వీట్ చేసింది. రెండు ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. తమిళ నటుడు జయం రవి, హన్సిక కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం ‘బోగస్’. ఈ చిత్రం షూటింగ్ సమయంలో హీరో రవి, దర్శకుడితో కలిసి ఫొటోలు దిగింది. ఈ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. లక్ష్మణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభు దేవా నిర్మాత.