: మార్కెట్లోకి త్వరలో మూడు శ్యామ్ సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్లు!


మే 6వ తేదీన మూడు రకాల ఆండ్రాయిడ్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు శ్యామ్ సంగ్ సంస్థ ప్రకటించింది. వీటిలో 'గెలాక్సీ ఎక్స్ ప్రెస్ ప్రైమ్ గో ఫోన్', 'గెలాక్సీ ఎక్స్ ప్రెస్ 3', 'గెలాక్సీ జె3' వున్నాయి. ఆయా ఫోన్ల ఫీచర్ల విషయానికొస్తే... * గెలాక్సీ ఎక్స్ ప్రెస్ ప్రైమ్ గో ఫోన్ లో... 5 అంగుళాల సూపర్ అమోలెడ్ స్క్రీన్, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ సామర్థ్యం, 5 ఎంపీ బ్యాక్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1.5 జీబీ ర్యామ్ ఉన్న ఈ ఫోన్లో కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ మార్ష్ మాల్లోను పొందుపరిచారు. * గెలాక్సీ ఎక్స్ ప్రెస్ 3లో... 2050 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 ఎంపీ కెమెరా ఉన్న ఈ ఫోన్ కు అమోలెడ్ స్క్రీన్ ఉంది. * గెలాక్సీ జె3లో... 5 అంగుళాల స్క్రీన్, 2 ఎంపీ ముందు కెమెరా, 1.5 జీబీ ర్యామ్, ఏ7 చిప్ సెట్, మెమొరీ కార్డు అవసరం లేకుండా 16 జీబీ నుంచి 128 జీబీ వరకు నిల్వ సామర్థ్యం ఈ ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News