: ఈ నెల కోహ్లీదే...సోషల్ మీడియా పాప్యులారిటీలో ధోనీని దాటేసిన కోహ్లీ


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్ సూపర్ హీరోను చేసింది. టీ20 వరల్డ్ కప్ ప్రదర్శనతో కోహ్లీ పాప్యులారిటీ అమాంతం పెరిగిపోయింది. గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఈ టోర్నీలో హీరో నిస్సందేహంగా విరాట్ కోహ్లీనే! అందుకే, అతని ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియా పాప్యులారిటీలో కోహ్లీ, ధోనీని దాటేశాడు. గత నెల రోజులుగా సోషల్ మీడియాలో ధోనీ గురించి 7 లక్షల మంది నెటిజన్లు సంభాషించగా, విరాట్ కోహ్లీ గురించి 12 లక్షల మంది సంభాషించడం విశేషం. ట్విట్టర్లో ధోనీకి 7 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, కోహ్లీకి 10.2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇలా ధోనీని కోహ్లీ సోషల్ మీడియాలో దాటేస్తున్నాడు.

  • Loading...

More Telugu News