: ఆడిపాడిన గేల్, బ్రావో.. ఆ వీడియో మీరూ చూడండి!
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్రవేశించిన వెస్టిండీస్ క్రీడాకారులు మంచి జోరు మీద ఉన్నారు. ముఖ్యంగా క్రిస్ గ్రేల్, డ్వేయిన్ బ్రావో లు చాలా హుషారుగా ఉన్నారు. నిన్నటి సెమీఫైనల్లో భారత్ పై గెలుపొందిన కరేబియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో ఆడి పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. కాగా, ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న జరిగిన సెమీఫైనల్ లో భారత్ పై గేల్ తక్కువ పరుగులకే ఔటయిన సంగతి విదితమే.