: మ్యాచ్ 'విన్'డీస్ దే... పోరాడి ఓడిన భారత్!


క్రిస్ గేల్ తో సంబంధం లేకుండా వెస్టిండీస్ ఆటగాళ్లు విజయం సాధించారు. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ఫీల్డింగ్ లో చేసిన పొరపాట్లు, బౌలింగ్ లో చేసిన తప్పులు టీమిండియా కొంపముంచాయి. క్రికెట్ మజాను పంచిన మ్యాచ్ లో తొలుత కోహ్లీ ఆకట్టుకోగా, తరువాత మ్యాచ్ ను ఛార్ల్స్ (52), సిమ్మన్స్ (83), రస్సెల్ (43) ఏకపక్షంగా మార్చేశారు. భారీ స్కోరును కాపాడుకునేందుకు టీమిండియా ఏ దశలోనూ ప్రయత్నించకపోవడం విశేషం. ఆటగాళ్లలో కసి లోపించింది. భారీ షాట్లు స్వేచ్ఛగా ఆడేందుకు విండీస్ ఆటగాళ్లకు టీమిండియా ఆటగాళ్లు అవకాశం కల్పించారు. దీంతో వెస్టిండీస్ ఆటగాళ్లు భారీ షాట్లతో లక్ష్యం ఛేదించారు. కీలక సమయాల్లో చేసిన తప్పులు భారతజట్టుకు శాపంగా పరిణమించాయి. దీంతో 19.4 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు లక్ష్యాన్ని ఛేదించి సత్తాచాటింది. భారత జట్టు ఓటమిపాలై టైటిల్ పోరు నుంచి నిష్క్రమించింది. దీంతో ఆదివారం జరగనున్న ఫైనల్స్ లో ఇంగ్లండ్ తో వెస్టిండీస్ తలపడనుంది.

  • Loading...

More Telugu News