: చెలరేగుతున్న విండీస్ ఆటగాళ్లు ఛార్ల్స్, సిమ్మన్స్
ఫీల్డింగ్ విషయంలో తొలుత టీమిండియా ఆకట్టుకుంది. ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ అమలులో ఉన్న తొలి 6 ఓవర్లలో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రధానంగా బౌలర్లు బంతులను ఆఫ్ సైడ్ వేయడంతో ధోనీ ఆ దిశగా సురేష్ రైనా, అజింక్యా రహానే, రోహిత్ శర్మలను మోహరించాడు. దీంతో విండీస్ బౌలర్లు ఎలాంటి షాట్లు ఆడినా గోడకట్టేసినట్టు బంతి వారిని దాటి వెళ్లేది కాదు. దీంతో బ్యాట్స్ మన్ లెగ్ సైడ్ ఆడారు. లెగ్ సైడ్ కోహ్లీ ఒక్కడే చెప్పుకోదగ్గ ఫీల్డర్ కావడంతో బంతులు బౌండరీ లైన్ ను దాటాయి. దీంతో తొలి ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 44 పరుగులు మాత్రమే సాధించింది. ఫీల్డింగ్ పరిమితులు సడలించడంతో భారత్ ఆటగాళ్లను ధోనీ మోహరించిన విధానంలో లోపాలు గుర్తించిన వెస్టిండీస్ ఆటగాళ్లు చార్ల్స్ (51), సిమ్మన్స్ (49) అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శించారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. స్పిన్నర్లు, పేసర్లు అన్న తేడా లేకుండా వారిద్దరూ భారీ షాట్లు కొట్టారు. దీంతో వెస్టిండీస్ విజయం దిశగా నెమ్మదిగా దూసుకుపోతోంది. 13 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది.