: మేం రెడీ...విధ్వంసానికి సిద్ధం: టీమిండియాకు సమీ హెచ్చరికలు


టీమిండియాతో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమి తెలిపాడు. విండీస్ జట్టులో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లకు కొదవలేదని సమి పేర్కొన్నాడు. భారత్ తో మ్యాచ్ లో విధ్వంసం సృష్టిస్తామని చెప్పాడు. టీమిండియాలో కోహ్లీ మ్యాచ్ విన్నర్ అనడంలో సందేహం లేదని అంగీకరించిన సమి, టీమిండియా లోపాలను పట్టించుకోమని చెప్పాడు. తమ బలాలపై దృష్టిపెట్టామని స్పష్టం చేశాడు. విధ్వంసకర ఆటగాళ్లతో నిండి ఉన్న విండీస్ జట్టు టీమిండియాతో ఆడేందుకు సిద్ధంగా ఉందని చెప్పాడు. ధోనీ టీంను ఎదర్కొనే సత్తా విండీస్ జట్టుకు ఉందని తెలిపాడు. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో విండీస్ తో భారత్ ఆడనుంది.

  • Loading...

More Telugu News