: 26 బంతుల్లో 50...కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన జాసన్ రాయ్
మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై ఇంగ్లండ్ అన్ని విధాలుగా ఆధిపత్యం చూపిస్తోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కట్టుదిట్టమైన బంతులతో కివీస్ బ్యాట్స్ మన్ ను ముప్పుతిప్పలు పెట్టిన ఇంగ్లిష్ బౌలర్లు 153 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం 154 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్, హేల్స్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఓవర్ కు పది పరుగుల రన్ రేట్ తో 8 ఓవర్లలో 79 పరుగులు చేశారు. ఈ క్రమంలో జాసన్ రాయ్ (56) కేవలం 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేయడం విశేషం. అతనికి జతగా హేల్స్ (20) క్రీజులో ఉన్నాడు. దీంతో లక్ష్య ఛేదన దిశగా ఇంగ్లండ్ దూసుకుపోతోంది.