: ధోనీ డాటర్ తో కోహ్లీ సెల్ఫీ!... బ్లాక్ బెర్రీతో జివా, డిస్టర్బ్ చేయొద్దంటున్న విరాట్!
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ నిన్న తన ఫేస్ బుక్ పేజీలో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ముద్దుల కూతురు జివాతో కలిసి తీసుకున్న సదరు సెల్ఫీ చూడ ముచ్చటగా ఉంది. బ్లాక్ బెర్రీ ఫోన్ ను చెవి దగ్గర పెట్టుకున్న జివా పక్కన ఉన్న కోహ్లీ... ఫోన్ లో మాట్లాడుతున్న చిన్నారిని డిస్టర్బ్ చేయొద్దన్న ఎక్స్ ప్రెషన్ లో కనిపిస్తున్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో టీమిండియాను సెమీస్ కు చేర్చిన కోహ్లీ... రెండు రోజుల విశ్రాంతి నేపథ్యంలో జివాతో సెల్పీ దిగాడు. ధోనీ డాటర్ క్యూట్ గా ఉందని సదరు ఫొటోకు క్యాప్షన్ కూడా తగిలించాడు.