: సైక్లింగ్ రేసులో విషాదం, బెల్జియం సైక్లిస్టు దుర్మరణం


జెంట్-వెవిల్ జమ్ రేసులో జరిగిన ప్రమాదంలో బెల్జియం దేశానికి చెందిన ప్రముఖ సైక్లిస్టు ఆంటోయిన్ డెమోయ్ టీ(25) దుర్మరణం చెందాడు. నిన్న బెల్జియంలో నిర్వహించిన సైక్లింగ్ రేసులో ఆయన పాల్గొన్నాడు. ఈ రేసు ఉత్తర ఫ్రాన్స్ నుంచి వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక మోటార్ సైకిల్ అతన్ని ఢీ కొట్టింది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆంటోయిన్ ప్రాణాలు విడిచాడు. ఆంటోయిన్ మృతిపై పలువురు సైక్లిస్టులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News