: అనుష్క పేరెత్తితే... విరాట్ కోహ్లీకి చిర్రెత్తుకొచ్చిన వేళ..!
అవును... విరాట్ కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. ఎందుకో తెలుసా? అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాపై విజయాన్ని అందించినందుకు ఓ పక్క పొగడుతూనే, అనుష్కా శర్మతో విడిపోయిన తరువాత నీ ఆట బాగుందంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతుంటే కోపం రాదూ మరి? దీంతో తన ట్విట్టర్ ఖాతా ద్వారా మండిపడ్డాడు. ఆమెను అలా ఎందుకు ఆడిపోసుకుంటున్నారని ప్రశ్నించాడు. ఓ నల్లని గోడపై 'షేమ్' అని రాసున్న చిత్రాన్ని పోస్టు చేశాడు. ఆమె తనకెప్పుడూ పాజిటివ్ గా మద్దతిచ్చిందని అన్నాడు. కాగా, కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న కోహ్లీ, అనుష్కల జంట ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే.