: కూలిన సైనిక హెలికాప్టర్... 12 మంది మృతి!

అల్జీరియాలో మిగ్-171 హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 12 మంది సైనికులు మరణించారు. అద్రార్ ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగిందని, సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ కూలిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు సైనికులు ప్రాణాలతో బయటపడటంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించామని అల్జీరియా రక్షణ శాఖ వెల్లడించింది. కాగా, 1962లో అల్జీరియాకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 15 సార్లు విమానాలు కుప్పకూలాయి.

More Telugu News