: సీట్లు, అధికారం లేకుండానే అనేక విజయాలు సాధించాం: ‘లోక్ సత్తా’ జేపీ

సీట్లు, అధికారం లేకుండానే ‘లోక్ సత్తా’ అనేక విజయాలు సాధించిందని లోక్ సత్తా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఇకపై ఎటువంటి ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ పోటీ చేయదని ప్రకటించిన ఆయన ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నేను యుద్ధం నుంచి పారిపోలేదు. అస్త్రం మాత్రమే మార్చాను. స్వచ్ఛంద సంస్థగా రాజకీయ పార్టీగా ఇరవైఏళ్ల పోరాటంలో దేనికీ రాజీపడలేదు. కులం, డబ్బు ఆధారంగా రాజకీయాలు చేస్తే అధికారం లభించడం పెద్ద కష్టమేమీ కాదు. రాష్ట్ర విభజన సమయంలో అందరికంటే స్పష్టమైన వైఖరి చెప్పింది లోక్ సత్తానే, నేను ఐఏఎస్ గా పనిచేస్తున్నప్పుడు కూడా బ్యూరో క్రాట్ విధానాలు అవలంబించలేదు. ప్రజల్లో రాజకీయాల పట్ల మరింత చైతన్యం, శ్రద్ధ పెరగాలి. భారత రాజకీయాల్లో ప్రభుత్వాలు మెజారిటీ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో లోక్ సత్తాది కీలకపాత్ర’ అని జేపీ అన్నారు.

More Telugu News