: పాము కాటేసిందని దానిని తినేశాడు... ఆసుపత్రి పాలయ్యాడు!

జార్ఖండ్ లోని కొల్హాన్ గిరిజన తెగలో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. అందులో ఒక మూఢనమ్మకాన్ని అనుసరించిన ఒక గిరిజన యువకుడు తనను కాటేసిన ఆ పామును తినేసి ఆసుపత్రి పాలయ్యాడు. రాజధాని రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలోని లోహర్ దగా జిల్లాలో ఉన్న హమ్ర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సురేంద్ర ఓరాన్ అనే ముప్ఫై సంవత్సరాల గిరిజనుడు తన పొలంలో పనిచేసుకుంటుండగా పాము కాటుకు గురయ్యాడు. పాము కాటు వేసినందుకు సురేంద్ర భయపడకపోగా, దానిని పట్టుకుని కొరికి తినేశాడు. పాము తల భాగం మినహా పూర్తిగా తినేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితిలో తేడా వచ్చింది. దాంతో జరిగిన విషయమంతా తన కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో, వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం అతని ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని, అతన్ని డిశ్చార్జ్ చేశామని వైద్యులు చెప్పారు.

More Telugu News